![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1016 లో... ఇందుని తీసుకొని వాళ్ళ ఇంటికి వస్తాడు రాజు. ఇందుని చూసి అందరు షాక్ అవుతారు. ఈ అమ్మాయి ఎవరు అని వాళ్ళ నాన్న అడుగుతాడు. పెళ్లి అని రాజు ఏదో చెప్పబోతుంటే రాజు పెళ్లి చేసుకొని వచ్చాడని ఇంట్లో అందరు అనుకుంటారు.
నేను చెప్పేది పూర్తిగా వినండి అని రాజు అంటాడు. ఈ రోజు మీ పెళ్లి రోజు కదా పెళ్లి రోజుని సింపుల్ గా చెయ్యడానికి వచ్చింది.. తను ఈవెంట్ మేనేజర్ అని రాజు చెప్తాడు. అవునులే నీ మొహానికి ఇంత అందమైన అమ్మాయి లవర్ గా ఉంటుందా అని వాళ్ళ నాన్న అనగానే ఇందు నవ్వుకుంటుంది. ఈ రోజు మీరు ఏం పనులు చెయ్యకండి.. అన్ని పనులు మీ అబ్బాయి వాళ్ళు చూసుకుంటారని ఇందు చెప్తుంది. రాజుతో ఇందు గిన్నెలు తోమిస్తుంది.
మరొకవైపు వెంకీ చెట్టు ఎక్కి కొబ్బరి మట్టలు కొడుతాడు. అప్పుడే నందు వచ్చి నీతో మాట్లాడాలి బయటకు వెళదామని అంటుంది. నాకు చెట్టు ఎక్కడం వచ్చు కానీ దిగడం రాదని వెంకీ అంటాడు. అలాంటప్పుడు ఎందుకు ఎక్కావని ఇందు అంటుంది. ఇందుని చూసి నువ్వు ఏంటి అక్క అని నందు అడుగుతుంది. ఈవెంట్ ప్లానర్ అని రాజు చెప్తాడు. వెంకీని కిందకి దింపడానికి రాజు, ఇందు కింద ఒక చీర పట్టుకొని ఉంటారు. నందు వచ్చి నిచ్చెన వేస్తుంది. అది చూసి ఫ్రెండ్ అంటే నువ్వేనే అని వెంకీ అంటాడు. ఆ తర్వాత ఇందుని కిచెన్ లోకి తీసుకొని వెళ్తారు. వంట చేయడానికి కావల్సిన ఏర్పాట్లు అన్ని చేస్తారు.
తరువాయి భాగంలో ఇన్ని రోజులు బిజినెస్ లో లాభంగా వచ్చిన డబ్బులు ఏం చేశారు.. డబ్బులు కట్టి నా మనవరాలిని తీసుకొని రాకుంటే మీడియా వాళ్ళకి పోలీస్ వాళ్ళని ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తానని రేఖతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |